21, ఫిబ్రవరి 2015, శనివారం

ప్రియ మిత్రులారా.....


     ఈ  బ్లాగుని, మన మాతృబాష "తెలుగు" ఉనికిని కాపాడు కుందామన్న సదుద్దేశము తో మొదలు పెట్టాను. 


           అమ్మ అను మాటతో మొదలు పెట్టి మన చిట్టి చిట్టి పలుకులు మనకు తెలియకనే చివరికి మమ్మీ అన్న పాశ్చాత్య సాంప్రదాయములోకి వెళ్ళిపోయాము.

                 ప్రస్తుతము మనకు, ఆంగ్ల పదము  వాడకుండా ఒక్క రోజు కూడా గడవదంటే అతిశయోక్తి కాదేమో!  చివరికి నిరక్షరాస్యులు  కూడా వారికి తెలియకుండానే ఆంగ్ల పదాలు వాడేస్తున్నారు గమనించారా?

  
          మన అమూల్యమయిన తెలుగు భాష, మన ప్రాచీన వైద్యం, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన పండుగలు, మొదలయిన మరెన్నో విషయాలు,  వాటి వెనుక ఉన్న అర్దాలు,  ఉపయోగాలు గురించి కొంతయినా తెలుసుకుందామని నా ఈ  చిన్న ప్రయత్నము. 
                                                                        సహకరించగలరు........... 

సుబ్రహ్మణ్యం రెడ్డి....