పొడుపు కథలంటే అందరికీ ఇష్టమే కదా? పొడుపు కథలు ఆలోచనాశక్తికి పదును పెడతాయి. అటువంటి పొడుపు కథలను కొన్నింటిని సేకరించి ఈ క్రింద వ్రాస్తున్నాను. విడుపు (జవాబు) కోసము కొంతసేపు ప్రయత్నించి ఆ తరువాత పొడుపు (ప్రశ్నపై) నొక్కండి.
అక్కడక్కడ బంతి, అంతరాల బంతి, మద్దూరి సంతలోన మాయమైన బంతి ఏమిటది?
సూర్యుడు.
అడవిలో ఆంబోతు రంకె వేస్తుంది అంటే?
గొడ్డలి.
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైతక్కలాడింది ఏమిటది?
కవ్వం.
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, వంటి నిండా గాయాలు, కడుపునిండా రాగాలు ఏమిటది?
మురళి.
అడ్డ గోడ మీద బుడ్డ చెంబు, తోసినా ఇటు పడదు, అటు పడదు.
ఆబోతు మూపురం.
అనగనగా ఓ అప్సరస. ఆమె పేరులో మధ్య అక్షరం తీసేస్తే మేక.
మేనక.
అమ్మతమ్ముడిని కాను, కానీ నేను మీకు మేనమామను.
చందమామ.
అమ్మంటే దగ్గరకు.. అయ్యంటే దూరంగా పోయేవి ఏమిటి?
పెదవులు.
అయ్యకు అందవు. అమ్మకు అందుతాయి ఏమిటవి?
పెదవులు.
అరచేతి కింద అరిసంతది.
పిడక.
అరచేతిలో 60 నక్షత్రాలు ఏమిటది.
జల్లెడ.
అరంకణం గదిలో 60 మంది నివాసం.
అగ్గిపెట్టె, పుల్లలు.
అందంకాని అందం.
పరమానందం.
ఆకు చిటికెడు. కాయ మూరెడు.
మునగకాయ.
ఆ ఆటకత్తె ఎప్పుడూ లోపలే నాట్యం చేస్తుంది.
నాలుక.
ఆకాశంలో ఎగురుతుంది. పక్షి కాదు. మనుషుల్ని ఎగరేసుకుపోతుంది
గాలికాదు.
విమానం.
ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
చీమలదండు.
ఆకాశాన అప్పన్న.. నేలకుప్పన్న బోడినాగన్న.. పిండి పిసకన్నఏమిటది.
వెలగపండు.
ఆకాశాన కొడవళ్లు వ్రేలాడుతున్నాయి.
చింతకాయలు.
ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య దూలం.
ముక్కు.
ఆకుల్లేని అఢవిలో జీవంలేనిది, జీవమున్న జంతువులను
వేటాడుతుంది.
దువ్వెన.
ఆకేలేయదు నీరు తాగదు. నేలని పాకదు. ఏమిటి ఆ తీగ?
విద్యత్తు తీగ.
ఆడవాళ్లకు లేనిది, మగవాళ్లకు ఉండేది?
మీసం.
ఆరామడల నుంచి అల్లుడు వస్తే అత్తగారు వడ్డించింది విత్తులేని కూర.
పుట్టగొడుగులు.
ఆకు బారెడు. తోక మూరెడు.
మొగలిపువ్వు.
ఆకాశంలో 60 గదులు, గదిగదికో సిపాయి, సిపాయికో తుపాకి.
తేనెపట్టు.
ఆకాశంలో అంగవస్ర్తాలు ఆరబెట్టారు.
అరిటాకు.
ఇల్లు కాని ఇల్లు.
బొమ్మరిల్లు.
ఇల్లంతా వెలుగు, బల్లకింద చీకటి ఏమిటది.
బల్ల మీద ఉన్న దీపం.
ఇంతింత ఆకు, ఇంపైన ఆకు, రాజుల మెచ్చిన రత్నాల ఆకు?
తమలపాకు.
ఇల్లంతా తిరిగి ఓ మూలన కూర్చొంటుంది.
చీపురుకట్ట.
ఇంటి వెనుక ఇంగువ చెట్టు ఎంత కోసినా తరగదు.
పొగ.
ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ.
అప్పడం.
ఈకలు ఈరమ్మ, ముళ్ల పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే.
ఉల్లిపాయ.
ఈత చెట్టుకి ఇద్దరు బిడ్డలు.
కల్లు కుండలు.
ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
నిప్పు.
ఎందరు ఎక్కినా విరగని మంచం.
అరుగు.
ఎర్రవాడొస్తే, తెల్లవాడు పారిపోతాడు.
సూర్యుడు, చంద్రుడు.
ఒకటే తొట్టి, రెండు పిల్లలు.
వేరుశనగ కాయ.
ఓహొయి రాజా! నీ ఒడ్డు పొడుగేమి? పట్టుకోబోతే పిడికెడు లేవు?
పొగ.
కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు.
ఉల్లిపాయ.
కాళ్ళు లేవు గానీ నడుస్తుంది. కళ్ళు లేవు గానీ ఏడుస్తుంది?
మేఘం.
కుడితి తాగదు, మేత మేయదు, కానీ కుండెకు పాలిస్తుంది?
తాటిచెట్టు. (కల్లు)
కొప్పుంది కాని జుట్టు లేదు, కళ్లున్నాయి కానీ చూపు లేదు?
కొబ్బరికాయ.
కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు ఏమిటది?
నత్త.
చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు, నోరు లేవు, తంతే తన్నింది గాని కాళ్ళు లేవు ఏమిటది?
అద్దము.
చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నార బట్టలు ఏమిటది ?
టెంకాయ.
జానెడు ఇంట్లో, మూరెడు కర్ర?
కుండలో గరిటె.
జామ చెట్టు కింద జానమ్మ, ఎంత గుంజినా రాదమ్మా.
నీడ.
తల నుండి పొగ చిమ్ముంది, భూతం కాదు. కన్నులెర్రగా ఉండు రాకాసి కాదు. పాకిపోవుచుండు పాము కాదు?
రైలు బండి.
తలపుల సందున మెరుపుల గిన్నె.
దీపం.
తల్లి కూర్చొండు, పిల్ల పారాడు.
కడవ, కడవ దగ్గర చెంబు.
తల్లి దయ్యం, పిల్ల పగడం ఏమిటది?
రేగుపండు.
తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది ఏమిటది?
అత్తి చెట్టు.
తెల్లకోటు తొడుక్కున్న ఎర్ర ముక్కు దొర ఎవరు?
కొవ్వొత్తి.
తొడిమ లేని పండు.
విభూది పండు.
తోలుతో చేస్తారు, కర్రతో చేస్తారు, అన్నం పెడతారు, అదే పనిగా బాదుతారు?
మద్దెల.
తొండము వుంటుంది కానీ ఏనుగు కాదు, రెక్కలు వుంటాయి కానీ పక్షి కాదు, ఆరు కాళ్ళు వుంటాయి కానీ చీమ కాదు ఏమిటది?
సీతాకోక చిలుక.
తోలు నలుపు, తింటే పులుపు ఏమిటది?
చింతపండు.
తోలు తియ్యన్నా, గుండు మింగన్నాఅంటే?
అరటి పండు.
తోవలో పుట్టేది, తోవలో పెరిగేది, తొవలో పోయేవారి కొంగు పట్టేది?
ఉత్తరేణి.
దాని పువ్వు పూజకు పనికి రాదు, దాని ఆకు దొప్పకు పనికి రాదు, దాని పండు మాత్రము అందరికి అవసరము ?
చింతపండు.
దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు,కానీ జీవుల్ని చంపుతుంది?.
వల.
దాస్తే పిడికిలిలో దాగుతుంది, తీస్తే ఇల్లంతా జారుతుంది.
దీపం వెలుగు.
నల్లకుక్కకు నాలుగు చెవులు అంటే?
లవంగం.
నామముంది కాని పూజారి కాదు. వాలముంది కానీ కోతి కాదు.
ఉడుత.
నూరు పళ్లు, ఒకటే పెదవి.
దానిమ్మ పండు.
పుడుతుంది, ప్రాణముంటుది కానీ చలనము వుండదు ఏమిటది?
గ్రుడ్డు.
పూజకు పనికిరాని పువ్వు, పడతులు మెచ్చే పువ్వు.
మొగలిపువ్వు.
పైడిపెట్టెలో ముత్యపు గింజ.
బియ్యపు గింజ.
పైన చూస్తే బోడి గుండు, పగుల గొడితే బొచ్చు ఉండు?
పత్తి కాయ.
పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
ఉంగరం.
పొడవాటి మానుకి నీడే లేదు.
దారి
పోకంత పొట్టి బావ, గంపంత కడవ మోస్తాడు.
పొయ్యి.
పోకంత పొట్టోడు. ఇంటికి గట్టోడు.
తాళం కప్ప.
బంగారు చెంబులో వెండి గచ్చకాయ.
పనస గింజ.
బండకేసి కొడితే వెండి ఊడి పడుతుంది?
కొబ్బరికాయ.
ఒక మనిషికి రెండే కాళ్లు, ఏడు చేతులు.
నిచ్చెన.
మూలన కూర్చుంటుంది. ఎండొచ్చినా, వానొచ్చినా బయటకు
బయలుదేరుతుంది ఏమిటది?
గొడుగు.
మనము నిలబడితే నిలబడుతుంది, కూర్చుంటే కూలబడుతుంది ఏమిటది?
నీడ.
ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది.
అత్తిపత్తి.
రాజుగారితోటలో రోజా పూలు, చూసేవారే గాని, లెక్క వేయగలిగేవారు లేరు ఏమిటవి?
నక్షత్రాలు.
వానా లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆకూ లేక సున్నం లేక నోరు ఎర్రంగ ఉంటుంది ఏమిటది?
రామచిలుక.
వేలెడంత వుండదు, కానీ మనము బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లోకి రావాలన్నా అది వుండాల్సిందే ఏమిటది?
తాళం చెవి.
విత్తనము లేకుండా పండేది.
ఉప్పు.
సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
సూది.
ఇంకా ఇలాంటి పొడుపు కథలు మీకు తెలిసి వుంటే నాకు తెలుపగలరు.
My e mail id : vsubrahmanyamreddy@gmail.com
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
పొడుపు
విడుపు
కాళ్ళు చేతులు లేవు కానీ ఎగురుతుంది దూకుతుంది
రిప్లయితొలగించండిMegam
తొలగించండిగుండ్రంగా వుంటాను నేను బంతి నీ కాదు కింద పడితే పగిలిపోతాను గుడ్డు నీ కాదు ఆడవాళ్ళ కి మాత్రమే ఉపయోగపడతాను నేను ఎవరిని
రిప్లయితొలగించండిBangles
తొలగించండిచెప్పుకోండి చూదాం
రిప్లయితొలగించండిచూపులేని కన్ను..
సుందరమైన కన్ను..
తోటలోని కన్ను..
తోక కన్ను.. కన్ను కాని కన్ను.
Oka chinnari valla daddy ni ila adigindi udyam 6 untai madhyananiki 16 untai sayantraniki 56 untai ratriki 76 untai emitiavi?
రిప్లయితొలగించండి