- ఆకలి రుచి ఎరుగదు - నిద్ర సుఖము ఎరుగదు.
- ఆకాశానికి హద్దే లేదు.
- ఆకార పుష్టి నైవేద్య నష్టి.
- ఆకులు నాకేవాడి మూతులు నాకినట్లు.
- ఆడది తిరిగి చెడుతుంది మగవాడు తిరక్క చెడుతాడు.
- ఆ తానులోదే ఈ ముక్క.
- ఆత్రపు పెండ్లి కొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు.
- ఆదిలోనే హంస పాదు.
- ఆడబోయిన తీర్దము ఎదురైనట్లు.
- ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు.
- ఆడ వారి మాటలకు అర్ధాలే వేరు.
- ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు.
- ఆడే కాలు పాడే నోరు ఊరికే ఉండవు.
- ఆ మొద్దులోదే ఈ పేడు.
- ఆలస్యం అమృతం విషం.
- ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం.
- ఆలి బెల్లం తల్లి అల్లం.
- ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ.
- ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారు.
- ఆరోగ్యమే మహా భాగ్యము.
- ఆవులలో ఆబోతై తినాలి, అత్తవారింట్లో అల్లుడై తినాలి.
- ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేదంట.
- ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం.
- ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా.
- ఆశకి అంతం లేదు.
- ఆస్తి మూరడు ఆశ బారడు.
ఆ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్‌లు (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి