- అ-ఆ లు రావు కాని అగ్ర తాంబూలం మాత్రం నాకే అన్నట్లు.
- అక్క కాపురం అడగక్కర లేదు - చెల్లెలి కాపురం చెప్పక్కర లేదు.
- అక్క మనదైతే బావ మనవాడా?
- అక్కర ఉన్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ.
- అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం.
- అగ్నికి వాయువు తోడయినట్లు.
- అడ కత్తెర లో పోక చెక్క లా.
- అడగందే అమ్మ అయినా పెట్టదు.
- అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు.
- అడుక్కునే వాడికి అరవై ఆరు కూరలు.
- అడుక్కుతినే వాడి దగ్గర గీక్కు తినేవాడు ఉన్నట్లు.
- అడుక్కునే వాడికి ఆలి అయ్యేకంటే ధనవంతుడికి దాసి అయ్యేది మేలు.
- అడుసు తొక్క నేల, కాలు కడుగ నేల.
- అడిగే వాడికి చెప్పేవాడు లోకువ.
- అతి వినయం దూర్త లక్షణం.
- అతి రహస్యం బట్ట బయలు.
- అత్త పేరు పెట్టి కూతుర్ని కుంపట్లో తోసిందట.
- అత్త మీద కోపం దుత్తమీద చూపినట్లు.
- అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.
- అత్త లేని కోడలు ఉత్తమురాలు - కోడలు లేని అత్త గుణవంతురాలు.
- అత్త వారింటి ఐశ్వర్యము కన్నా పుట్టింటి గంజి మేలు.
- అత్తా ఒకింటి కోడలే, మామా ఒకింటి అల్లుడే.
- అద్దం అబద్దం ఆడదు కదా!
- అదిగో తెల్ల కాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు.
- అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.
- అధికమైతే అమృతం కూడా విషమే.
- అదృష్టం చెప్పి రాదు దురదృష్టం చెప్పి పోదు.
- అదృష్టవంతుడిని చెరిపేవారూ లేరు దురదృష్టవంతుడిని బాగుపరిచేవారూ లేరు.
- అనగా అనగా రాగం తినగా తినగా రోగం.
- అనుమానం పెను భూతం.
- అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టినట్లు.
- అన్నం చొరవే కాని అక్షరం చొరవ లేదు.
- అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి, దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా ఫరవాలేదు.
- అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్లు.
- అన్న వారు బాగున్నారు, పడిన వారు బాగున్నారు, మధ్యనున్నవారు మాత్రం నలిగిపోయారు.
- అనువు కాని చోట అధికులమనరాదు.
- అన్ని దానాల లోకి నిదానమే గొప్పదట.
- అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని పుల్లాకు ఎగిరెగిరి పడుతుంది.
- అన్నీ సాగితే రోగమంత భోగం మరొకటి ఉండదు.
- అప్పు ఇచ్చి చూడు, ఆడ పిల్లను ఇచ్చి చూడు.
- అప్పు చేసి పప్పు కూడు.
- అప్పులున్న వాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోరాదు.
- అప్పులున్నోడి వెనుక, చెప్పులున్నోడి వెనుక వెళ్ళరాదు.
- అబద్దము ఆడితే అతికినట్లు ఉండాలి.
- అభ్యాసము కూసు విద్య.
- అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది.
- అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?
- అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినా తిన నివ్వదు.
- అమ్మకి కూడు పెట్టని వాడు పెద్దమ్మకి కోక పెడతానన్నాడట.
- అమ్మబోతే అడవి కొనబోతే కొరివి.
- అయితే ఆదివారం లేకుంటే సోమవారం.
- అయిదోతనం లేని అందం అడుక్కు తిననా?
- అయినోళ్లకి ఆకుల్లో కానోళ్ళకి కంచాల్లో.
- అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు.
- అయ్యవారు ఏంచేస్తున్నారు అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్లు.
- అయ్యవారు వచ్చేవరకు అమావాస్య ఆగదు.
- అరఘడియ భోగం ఆరు నెల్ల రోగం.
- అర చేతిలో వైకుంఠం చూపినట్లు.
- అరచేతిలో వెన్నపెట్టుకొని, నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్లు.
- అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్లు.
- అర్ధరాత్రి మద్దెల దరువు.
- అరిచేతిలో బెల్లం పెట్టి, మోచేయి నాకించినట్లు.
- అరిచే కుక్క కరవదు.
- అలకా పురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా?
- అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుంది అన్నాడట.
- అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం
- అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే ఎలా?
- అసలు లేవురా మగడా అంటే పెసర పప్పు వండవే పెళ్ళామా అన్నాడట.
- అసలే కోతి ఆపై కల్లు తాగి నిప్పులు తొక్కినట్లు.
అ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
వీలైతే ఈ సామెతలకు అర్దాన్ని, అవి మొదలైన తీరుని వివరించగలిగితే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అన్నిటికీ కుదరదు అనుకోండీ, కొన్నిటికైనా..
రిప్లయితొలగించండిఉఛ్చ తక్కువ ఊపుడెక్కువ
రిప్లయితొలగించండి